తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం - కమారుజుమన్​ సర్కార్

మహిళలపై వరుస హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసుడిని బంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కమారుజుమన్ సర్కార్​ గత కొన్ని నెలలుగా ఈ దారుణానికి ఒడిగడుతున్నాడు. అతనికి జిల్లా కోర్టు 12 రోజుల రిమాండ్​ విధించింది.

మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

By

Published : Jun 4, 2019, 8:06 PM IST

Updated : Jun 4, 2019, 11:37 PM IST

మధ్య వయస్కులైన మహిళలను అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడుతున్న కిరాతకుడిని అరెస్ట్ చేశారు బంగాల్ పోలీసులు. తూర్పు బుర్ద్వాన్​ జిల్లాలో ఈ వరుస ఘటనలకు పాల్పడ్డాడు నిందితుడు కమారుజుమన్ సర్కార్. కల్నాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ నిందితుడు ఇప్పటి వరకు 6 హత్యలు చేశాడు.

ఇలా హత్యలు చేస్తాడు..

42 ఏళ్ల కమారుజుమన్​ సర్కార్​ పాత వస్తువులు కొని అమ్మే చిన్న వ్యాపారి. ఖరిదైన వస్త్రాలు ధరించి మధ్యాహ్నం వేళల్లో... విద్యుత్ మీటరు​ రీడింగ్​ చూసే నెపంతో ఇళ్లలోకి చొరబడతాడు. అనంతరం మధ్య వయస్కులైన ఒంటరి మహిళలపై సైకిల్​ చైన్​, ఇనుపరాడ్​లను ఉపయోగించి హత్య చేస్తాడు. హత్యానంతరం ఈ నరరూప రాక్షసుడు మృతుల శవాలపై అత్యాచారానికి పాల్పడినట్లు తేల్చారు పోలీసులు. మరి కొన్ని కేసుల్లో మృతుల మర్మావయవాల్లో పదునైన వస్తువులను దూర్చినట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు ప్రధానంగా హూగ్లీ, బుర్ద్వాన్​ జిల్లాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

మే 21న గోరా గ్రామంలో జరిగిన పుతుల్​ మజ్హి అనే మహిళ హత్య కేసులో... నిందితునికి జిల్లా న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది.

అతని ఉద్దేశం దొంగతనం కాదు..

హంతకుడు సర్కార్​ కొన్ని ఇళ్లలోని విలువైన వస్తువులు దొంగతనం చేశాడు. అయితే అతని ఉద్దేశం మాత్రం దొంగతనం కాదని, మధ్య వయస్కులైన మహిళలను చంపడమే అతని ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

మహిళలపై కక్షతోనే..

నరహంతకుడు సర్కార్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కక్షలతోనే మహిళలపై హత్యలకు పాల్పడుతుండవచ్చనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పట్టించిన ఎర్రబండి

నిందితుడు ఎర్రని మోటార్​బైక్​పై ఎర్రని శిరస్త్రాణం ధరించి వెళ్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్​ ఆధారంగా అతనిని బుర్ద్వాన్ జిల్లా కల్నా వద్ద అరెస్టు చేశారు.

రక్త చరిత్ర సృష్టించాడు

సర్కార్ జనవరి 27న అనుకల్​ ప్రాంతంలో పుష్పాదాస్ అనే మహిళను హత్యచేశాడు. ఏప్రిల్​ 4న రీటారాయ్​, మమతా కిష్కులను గంటల వ్యవధిలోనే కడతేర్చాడు. మిమేరీ ప్రాంతంలో సోనీయాదవ్​ను ఇదే రీతిలో హత్యచేశాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: పెట్రో ధరలపై కేంద్ర మంత్రుల సమీక్ష

Last Updated : Jun 4, 2019, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details