సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి బ్రిటన్ ప్రధాని థెరిసా మే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను అధికారులు సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. ఇరు దేశాలకు సంబంధించి పలు విషయాలపై మోదీతో మే చర్చించారని బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.
"ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయనతో మాట్లాడారు థెరిసా మే. బ్రిటన్ ఆతిథ్యమిస్తోన్న క్రికెట్ ప్రపంచకప్ విషయంపై చర్చించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగించాలని ఇద్దరు నేతలు ఆకాక్షించారు. జపాన్లో జరిగే జీ-20 సదస్సులో ఈ స్ఫూర్తి కనబరచాలని నిర్ణయించారు."