తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం - తమిళనాడు క్రైమ్​ వార్తలు

తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. ఓ 11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు ముగ్గురు మైనర్లు. బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించి పలుమార్లు చిన్నారిపై దారుణానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Boys Forced 11 year old girl to watch porn
11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసు

By

Published : Jun 22, 2020, 3:07 PM IST

ఓ 11 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మైనర్లను అరెస్ట్​ చేశారు పోలీసులు. తమిళనాడు కోయంబత్తూర్​లోని సుందరాపురంలో జరిగిందీ దారుణం.

ఇదీ జరిగింది..

చాలా ఏళ్ల క్రితమే తల్లిని కోల్పోయిన ఆ చిన్నారి.. తండ్రి, పిన్నమ్మల వద్దే ఉంటోంది. వారిద్దరూ కూలీ పనులకు వెళ్లడం వల్ల ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. ఒంటరిగా ఉన్న ఆ బాలిక టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లేది. అలా వెళ్లిన ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి అశ్లీల చిత్రాలను చూపించేవారు నిందితులు. పలుమార్లు బాలికపై అత్యాచారం చేశారు. నిందితులలో పదవతరగతి చదివే ఓ బాలుడు సహా మరో ఇద్దరు ఉన్నారు.

పోక్సో చట్టం కింద కేసు..

ఇటీవల పాప ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న వైద్యులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు మైనర్లను అరెస్ట్​ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరొకడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:20 హత్యల సైనైడ్​ మోహన్​కు బుధవారం శిక్ష!

ABOUT THE AUTHOR

...view details