టిక్‌టాక్ కోసం ప్రాణం తీసుకున్నాడు
టిక్‌టాక్ మరో ప్రాణాన్ని బలిగొంది. వైవిధ్యంగా వీడియో తీద్దామనుకొని గొంతుకు గొలుసు కట్టుకున్న బాలుడు ఊపిరాకడ మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది.
టిక్‌టాక్‌లో వైవిధ్యంగా వీడియో చేసి ఫేమస్ కావాలన్న సరదా.. పన్నెండేళ్ల బాలుడి ప్రాణాలనే తీసింది. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది. ఆరో తరగతి చదువుతున్న కౌశల్ అనే బాలుడు వీడియో రూపొందించడం కోసం తల్లి మంగళసూత్రం, గాజులు ధరించి.. బాత్రూంలోకి వెళ్లాడు. పెద్ద ఇనుప గొలుసును మెడకు చుట్టుకొని వీడియో తీయడం ప్రారంభించాడు. కాసేపటికి ఆ గొలుసు మెడకు గట్టిగా బిగుసుకుపోయి ఊపిరాడక మరణించాడు. లోపలికెళ్లిన పిల్లాడు ఎంతకూ బయటికి రాకపోవడం వల్ల తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. చనిపోయిన బాలుడిని చూసి బోరున విలపించారు.