'మగధీర' సినిమాలో వేగంగా పరుగెత్తే గుర్రాన్ని హీరో వెంబడించి తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. సరిగ్గా అలాంటి ఉత్కంఠ సన్నివేశమే మహారాష్ట్రలోని 'సాంగలీ'లో జరిగింది. బాలుడు గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రం అదుపు తప్పింది. గుర్రంతో పాటు దానిపై ఉన్న బాలుడూ పడిపోయాడు.
ఈ బాలుడి సాహసం అద్భుతం... - సాంగలీ
గుర్రపు స్వారీ చేస్తున్న బాలుడు హఠాత్తుగా కిందపడ్డాడు. వేగంగా పరుగులు తీస్తున్న ఆ అశ్వాన్ని బాలుడు తిరిగి వశపరుచుకున్నాడు. ఈ సాహస సన్నివేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ బాలుని సాహసం అద్భుతం...
అశ్వం తిరిగి తన పరుగును కొనసాగించింది. దానిని అందుకునేందుకు గుర్రంతో పోటీపడ్డ బాలుడు విజయం సాధించాడు. అతడు చేసిన ప్రయత్నం సినిమా సన్నివేశాన్ని తలపించింది. వెనకాలే వచ్చిన ద్విచక్ర వాహనదారులు అతనికి సహకారం అందించారు. బైక్పై గుర్రాన్ని వెంబడించారు. ద్విచక్రవాహనం పైనుంచే గుర్రంపైకి బాలుడు సాహసోపేతంగా ఎక్కాడు.