తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన రగడ.. సోనూసూద్​పై ఠాక్రే ప్రశంసలు - sonusood charity

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా కాలంలో వలస కార్మికులకు అందిస్తున్న చేయూత పట్ల సోనూసూద్​పై ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు ఠాక్రే. శివసేన పత్రిక సామ్నాలో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, పత్రికలో సోనూసూద్​కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

sonusood
ముగిసిన రగడ.. సోనూసూద్​పై ఠాక్రే ప్రశంసలు

By

Published : Jun 8, 2020, 6:28 AM IST

లాక్​డౌన్ కాలంలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చి ప్రజాదరణ చూరగొన్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్ చేస్తున్న సేవలపై ప్రశంసలు కురింపించారు ఠాక్రే. వలసకార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చే అంశంలో సోనూ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని చెప్పుకొచ్చారు. శివసేన పత్రిక 'సామ్నా'లో సంపాదకుడు, శివసేన ఎంపీ సంజయ్​ రౌత్.. సోనూసూద్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

సోనూ వెనక భాజపా వ్యాఖ్యతో మొదలు..

లాక్​డౌన్ కాలంలో ప్రజలకు సోనూసూద్‌ చేస్తున్న సేవల పట్ల.. భాజపా చేతిలో కీలుబొమ్మగా అభివర్ణిస్తూ శివసేన పత్రిక సామ్నాలో సంజయ్‌రౌత్‌ వ్యాసం రాశారు. లాక్​డౌన్ కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారని చెప్పారు. శివసేనను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే సోనూసూద్‌ను భాజపా తెరపైకి తీసుకొచ్చిందని సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. త్వరలోనే సోనూసూద్‌ ప్రధానిని కలిసి 'ఆ పార్టీకి' ప్రచారం కూడా చేస్తారని రౌత్‌ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్​తో భేటీ అయ్యారు సోనూసూద్.

ఇదీ చూడండి:'భాజపా చేతిలో సోనూసూద్​ కీలుబొమ్మ​'

ABOUT THE AUTHOR

...view details