తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరుబావిలో పడ్డ బాలుడి కథ సుఖాంతం

ఉత్తరప్రదేశ్​ మథుర అంగ్రాలాలో బోరుబావిలో పడిన ఐదేళ్ల ప్రవీణ్​ను రక్షించారు అధికారులు. బాలుడు సురక్షితంగా ఉన్నప్పటికీ... ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు.

బోరు బావిలో పడ్డ చిన్నారి

By

Published : Apr 14, 2019, 1:19 AM IST

Updated : Apr 14, 2019, 10:02 AM IST

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించిన అధికారులు

ఉత్తరప్రదేశ్​ మథుర ప్రాంతం అంగ్రాలాలో బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ప్రవీణ్​ను రక్షించారు అధికారులు. జాతీయ విపత్తు నిర్వహణ-ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, సైనికులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి బాలుడిని కాపాడారు. వంద అడుగుల లోతులో చిక్కుకున్న ప్రవీణ్​కు ఊతంగా ఓ పైపును పంపి... దాని సాయంతో కాపాడినట్లు రక్షణ బృందాలు తెలిపాయి.

"బాలుడు సురక్షింగా ఉన్నాడు. అతడి ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు. ముందుజాగ్రత్తగా ఆసుపత్రికి తరలించాం. వైద్యుల పరిశీలన అనంతరం కుటుంబ సభ్యలకు అప్పగిస్తాం."
- అనిల్​ కుమార్​ సింగ్​, ఎన్డీఆర్​ఎఫ్​ అసిస్టెంట్​ కమాండర్​

ఇలా పడిపోయాడు...

వ్యవసాయ కూలీ చేసేందుకు ఓ తల్లి కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడికి వచ్చిన ఇతర బాలురతో కలిసి ఆడుకుంటున్నాడు ప్రవీణ్. ఆటలో భాగంగా పరిగెడుతూ తెరచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. మిగతా పిల్లల అరుపులు విన్న తల్లిదండ్రులు, చుట్టు పక్కల ఉన్నవారు పరిగెత్తి వచ్చి అధికారులకు సమాచారాన్నందించారు. అనేక గంటల తర్వాత ప్రవీణ సురక్షితంగా బయటపడ్డాడు.

Last Updated : Apr 14, 2019, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details