తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పుడు లేని విశ్వాసం ఇప్పుడెలా వచ్చింది' - Randeep Surjewala

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈడీ పత్రాల్లో ఉన్న వ్యక్తులెవరో చెప్పాలన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ డిమాండ్​ను కాంగ్రెస్​ తప్పుబట్టింది. సహారా, యడ్యూరప్ప డైరీల విషయంలో మౌనంగా ఉన్న భాజపా... ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తోందని ఎద్దేవా చేసింది.

'అప్పుడు లేని విశ్వాసం ఇప్పుడెలా వచ్చింది

By

Published : Apr 6, 2019, 8:57 PM IST

అగస్టా వెస్ట్​లాండ్​ కేసులో కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ విమర్శలను కాంగ్రెస్​ తిప్పికొట్టింది. సహారా, యడ్యూరప్ప డైరీల విషయంలో మౌనంగా ఉన్న భాజపా...ఇప్పుడెలా మాట్లాడుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు

"ఆర్థిక మంత్రికి ఉన్నట్టుండి డైరీలపై విశ్వాసం పెరిగింది తప్పుడు ఆరోపణలు చేయాడానికే. ప్రధాని మోదీ, భాజపాలు సహారా, యడ్యూరప్ప డైరీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? వంచించడం, రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం భాజపా 'డీఎన్​ఏ'లోనే ఉంది "
- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఉన్న 'ఆర్​జీ', 'ఏపీ', 'ఎఫ్​ఏఎమ్' కోడ్​లు ఏమిటో కాంగ్రెస్​ చెప్పాలని జైట్లీ డిమాండ్​ చేశారు. 2013లో స్విట్జర్లాండ్​ పోలీసులు జరిపిన తనిఖీల్లోనూ ఇదే పేర్లతో ఉన్న పత్రాలు బయటపడ్డాయని గుర్తుచేశారు జైట్లీ.​

ABOUT THE AUTHOR

...view details