తెలంగాణ

telangana

By

Published : Jun 24, 2019, 1:20 PM IST

Updated : Jun 24, 2019, 3:20 PM IST

ETV Bharat / bharat

సీఎం ఇంటి నీటి బిల్లు బకాయి రూ. 7లక్షలు!

మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన 'వర్ష' సహా మంత్రుల భవనాలను పన్ను ఎగవేత జాబితాలో చేర్చింది బృహన్​ ముంబయి నగరపాలక సంస్థ(బీఎంసీ). నీటి బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం.

ముఖ్యమంత్రి ఫడణవీస్​

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ సహా 18మంది మంత్రులకు షాకిచ్చింది బృహన్ ​ముంబయి నగరపాలక సంస్థ(బీఎంసీ). రూ.7లక్షల 44 వేల 981 విలువైన నీటి బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని సీఎం అధికారిక భవనం 'వర్ష'ను పన్ను ఎగవేత జాబితాలో చేర్చింది.

18 మంది రాష్ట్ర మంత్రుల భవనాలు ఆ జాబితాలో ఉన్నాయి. వారు కూడా నీటి బిల్లులు చెల్లించలేదని వెల్లడించింది బీఎంసీ. సుధీర్ ముంగన్​తివార్, వినోద్​ తావ్డే, పంకజ్ ముండే, రాందాస్​ కదమ్, ఏక్​నాథ్​ శిందే సహా మరికొందరు మంత్రుల భవనాలు బీఎంసీ పన్ను ఎగవేత జాబితాలో ఉన్నాయి.

ఇదీ చూడండి : నీటి సంక్షోభంపై రాజకీయ దుమారం

Last Updated : Jun 24, 2019, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details