సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్లో జరిగిన భాజపా బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. వేర్పాటువాదులకు మద్దతు పలికే పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
'నాపై ద్వేషంతో.. దేశ ప్రయోజనాలను విస్మరిస్తోంది' - modi
తనపై ఉన్న వ్యతిరేకతతో దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ విస్మరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బాలాకోట్‌లో మెరుపు దాడుల అనంతరం కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు.
భాజపా సభలో మోదీ
"అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదేనా.. ఆయన అహర్నిశలు శ్రమించి దేశాన్ని ఏకం చేశారు. నాడు భారత దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదేనా.. కాదని నా ఆత్మ చెబుతోంది. చౌకీదార్ పై మీకు విశ్వాసం ఉందా.. మీకు నమ్మకముంటే కచ్చితంగా రాసిపెట్టుకోండి.. ఈ కూటమి పార్టీలకు పరాభవం తప్పదు. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
Last Updated : Mar 29, 2019, 2:24 AM IST