జమ్ములో ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. రద్దీగా ఉండే బస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో 32మంది గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జమ్ము దాడిలో ఒకరు మృతి - జమ్ము
జమ్ము బస్ స్టేషన్లో గ్రెనేడ్ పేలింది. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జమ్ములోని బస్టాండ్‌లో పేలుడు సంభవించింది
రద్దీగా ఉన్న సమూహమే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తి గ్రెనేడ్ విసరాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
జమ్ము బస్టాండ్‌పై గ్రెనేడ్ దాడి జరగడం గతేడాది మే నుంచి ఇది ముడోసారి. శాంతియుత వాతావరణానికి విఘాతం కల్గించేందుకే ముష్కరులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
Last Updated : Mar 7, 2019, 3:53 PM IST