తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జమిలి ఎన్నికల పేరుతో భాజపా కుట్ర'

భాజపా ప్రతిపాదించిన 'ఒకే దేశం..ఒకే ఎన్నిక' ఆలోచనను వ్యతిరేకించారు బహుజన సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. అది ఒకే సారి ఈవీఎంలను ట్యాంపరింగ్​ చేసి ఎన్నికల్లో గెలువచ్చనే కాషాయ పార్టీ వ్యూహంలోని కుట్రేనని ఆరోపించారు.

By

Published : Jun 24, 2019, 5:47 AM IST

'జమిలి ఎన్నికల పేరుతో భాజపా కుట్ర'

భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు బహుజన సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. భాజపా ప్రతిపాదించిన 'ఒకే దేశం..ఒకే ఎన్నిక' ఆలోచనకు తాను వ్యతిరేకమని చెప్పారు. ఒకేసారి ఈవీఎంలను ట్యాంపరింగ్​ చేసి లోక్​సభ, శాసనసభ ఎన్నికల్లో గెలువచ్చనే కాషాయ పార్టీ వ్యూహంలోని కుట్రగా పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లు సాధించటంపై అనుమానాలు ఉన్నాయన్నారు.

" 'ఒక దేశం.. ఒకే ఎన్నిక' అనేది కొత్త జిమ్మిక్. ఒకేసారి ఈవీఎంలను ట్యాంపరింగ్​ చేసి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి భాజపా చేసిన కుట్ర. అది దేశాన్ని కులతత్వంలోకి నేడుతుంది. లోక్​సభ ఎన్నికల్లో భాజపా విజయంలో ఎలాంటి అవకతవకలు లేకుంటే, దాని వైపు మెజారిటీ ఓట్లు ఉంటే.. బ్యాలెట్​ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా? వద్దా అని ప్రజల ముందుకు వెళ్లడానికి ఎందుకు దూరంగా ఉంటోంది."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం ఊహించని పరిణామామని పేర్కొన్నారు మాయావతి. అది ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రణాళికతో కుట్ర పన్ని అవకతవకలకు పాల్పడనిదే ఇటువంటి ఫలితాలు రావన్నారు.

ఇదీ చూడండి: మాయావతి సోదరుడు, మేనల్లుడికి పార్టీ కీలక పదవులు

ABOUT THE AUTHOR

...view details