తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వ ఏర్పాటు' - siddaramaiah

ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్​ నిర్ణయం తర్వాత మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అవకాశం వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భాజపా

By

Published : Jul 7, 2019, 7:46 PM IST

ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలో రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీఎస్​ యడ్యూరప్ప పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. "ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారా?" అని అడిగిన ప్రశ్నకు యడ్యూరప్ప ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

"చూద్దాం ఏం జరుగుతుందో? మేమేమైనా సన్యాసులమా? రాజీనామాల ప్రక్రియ ముగిశాక, స్పీకర్​ నిర్ణయాన్ని చెప్పనివ్వండి. మాది జాతీయ పార్టీ. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం."

-బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

అధికారం కోసమే ఈ సంక్షోభం: భాజపా

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్​, జేడీఎస్​ మధ్య పోరుతోనే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని భాజపా ఆరోపిస్తోంది. సీఎం కుమారస్వామి, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి అన్నారు.

"దీనంతటికీ కారణం కాంగ్రెస్​కు సరైన నాయకత్వం లేకపోవటమే. తమ లోపాన్ని కప్పిపుచ్చేందుకు ఇతరులపై నిందలు వేస్తున్నారు. ముందు మీ ఇళ్లు చక్కబెట్టుకోండి. కర్ణాటక కాంగ్రెస్​ అధిష్ఠానంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తోంది. సిద్ధరామయ్య, కుమారస్వామి మధ్య అంతరాలే ఈ స్థితికి తీసుకొచ్చాయి."

-ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి

కాంగ్రెస్-జేడీఎస్​ అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేల రాజీనామాతో రాష్ట్రంలో హైడ్రామా ఏర్పడింది. స్పీకర్​కు రాజీనామా సమర్పించిన ఎమ్మెల్యేలు అటునుంచి ముంబయికి మకాం మార్చారు. అయితే రాజీనామాలపై శాసనసభ స్పీకర్​ రమేశ్​ కుమార్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆదివారం సెలవు కావంట వల్ల సోమవారం పరిశీలిస్తానని స్పీకర్​​ తెలిపారు. అయితే ప్రభుత్వం కొనసాగింపుపై అసెంబ్లీలోనే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు రమేశ్ కుమార్. కర్ణాటకలో జులై 12న శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

మరో వైపు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కీలక నేతలు బెంగళూరుకు పయనమయ్యారు. సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ రంగంలోకి దింపింది.

ఇదీ చూడండి: 'కర్​నాటకం'లో కాంగ్రెస్​ ఆఖరి ప్రయత్నాలు

ABOUT THE AUTHOR

...view details