సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లక్ష్యంగా భాజపా ఎదురుదాడి తీవ్రం చేసింది. రాహుల్ వ్యక్తిగత ఆదాయం భారీగా పెరగడంపై విమర్శలు గుప్పిస్తోంది.
రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన ఆదాయం 9 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వ్యక్తిగత ఆదాయం 2004లో రూ.55 లక్షలుగా ఉంది. 2014 నాటికి రూ.9 కోట్లకు చేరింది. ఎలాంటి ప్రత్యక్ష ఆదాయ వనరులు లేకుండా రాహుల్ వ్యక్తిగత ఆదాయం ఇంత భారీగా ఎలా పెరిగిందని కేంద్రమంత్రి, భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
"రాహుల్‌గాంధీ 2004 ఎన్నికల అఫిడవిట్లో తన ఆదాయం రూ.55,38,123 లక్షలుగా పేర్కొన్నారు. 2009లో రూ.2 కోట్లుగా ఉన్న ఆదాయం 2014 నాటికి రూ.9 కోట్లకు చేరుకుంది. ఒక ఎంపీ ఎంత సంపాదిస్తారో మాకు తెలుసు. మేము ఓ విషయం అడగాలనుకుంటున్నాం. ఎలాంటి ప్రత్యక్ష ఆదాయ వనరులు లేకుండా రాహుల్ ఆదాయం ఇంతలా ఎలా వృద్ధి చెందిందని?"
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి