హరియాణాలో మరోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. తమకు రెండోసారి అధికారం అప్పగిస్తే చేయబోయే పనులు వివరిస్తూ 'సంకల్ప్ పాత్ర' పేరుతో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సహా పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు.
- 'హరియాణా కలల ప్రణాళిక’ అనే ఈ మేనిఫెస్టోలో రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలకు సరైన న్యాయం చేస్తామని ఉద్ఘాటించారు నేతలు.
- ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన నేపథ్యంలో రైతులకు రూ. 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.