తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' చట్టానికి మద్దతుగా 52 లక్షల ఫోన్​కాల్స్​ - అమిత్​ షా దిల్లీలోని లజ్​పత్​ నగర్​లో

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. మద్దతు కూడగట్టేందుకు టోల్​ ఫ్రీ నెంబర్​ను ఏర్పాటు చేసింది భాజపా. పౌర చట్టానికి మద్దతుగా.. సోమవారం సాయంత్రానికి 52 లక్షలకు పైగా కాల్స్​ వచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించారు.

bjp-received-over-52-lakh-calls-in-support-of-caa
'పౌర' చట్టానికి మద్దతుగా 52 లక్షల ఫోన్​కాల్స్​

By

Published : Jan 7, 2020, 5:31 AM IST

Updated : Jan 7, 2020, 6:04 AM IST

పౌరసత్వ చట్టానికి (సీఏఏ) మద్దతు సమీకరించేందుకు భాజపా ఓ టోల్​ ఫ్రీ నంబర్​ను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పౌర చట్టానికి మద్దతుగా సోమవారం సాయంత్రం వరకు 52.72 లక్షల ఫోన్​కాల్స్​ వచ్చినట్లు ప్రకటించారు.

డిసెంబర్​ నెలలో పౌరసత్వ సవరణ బిల్లు చట్టం రూపం దాల్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు హోరేత్తాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు 10 రోజుల పాటు ఇంటింటి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది భాజపా.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్​ షా దిల్లీలోని లజ్​పత్​ నగర్​లో​ పర్యటించారు. అక్కడి ప్రజలకు పౌరచట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు.

ఇదీ చూడండి:జల్లికట్టు కోసం తన ఎద్దు సిద్ధమంటోన్న విద్యార్థిని!

Last Updated : Jan 7, 2020, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details