తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70వ రాజ్యాంగ దినోత్సవానికై భాజపా భారీ కార్యక్రమాలు..!

మోదీ ప్రభుత్వం 10 రోజులపాటు 70వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడానికి ప్రణాళిక వేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని నవంబర్​ 26న పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

భాజపా ఆధ్వర్యంలో ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవాలు..!

By

Published : Nov 22, 2019, 8:19 PM IST

నవంబర్​ 26న.. 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా 10 రోజులపాటు నిర్వహించాలని భాజపా ప్రభుత్వం యోచిస్తోంది. భారత రాజ్యాంగం 1949 నవంబర్​ 26న అమల్లోకి వచ్చింది.

ప్రజలందరూ చూసేలా..

వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్​లోని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని ప్రజలందరూ చూసేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్​షా అన్ని రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మోదీ పాలన గురించి అర్థమయ్యేలా చెప్పండి..

'సంవిధాన్​ దివస్​'(రాజ్యాంగ దినోత్సవం)లో భాజపా కార్యకర్తలు, సామాన్య ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అమిత్​షా విజ్ఞప్తి చేశారు. అలాగే భాజపా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ జిల్లా ఇన్​ఛార్జీలకు ఒక ప్రకటన కూడా జారీచేశారు. ఎన్​డీఏ హయాంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా బలపడుతున్నాయో కూడా సామాన్యులకు వివరించాలని దిశానిర్దేశం చేశారు.

మోదీ ఎలా పరిపాలన చేస్తున్నారో.. తమ హయాంలో పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం శివసేనదే..!

ABOUT THE AUTHOR

...view details