తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మోదీ ఉంటే అన్నీ సాధ్యమే" - భాజపా

లోక్​సభ ఎన్నికలకు సరికొత్త నినాదాన్ని ప్రకటించింది భాజపా. 'మోదీ హైతో ముమ్కిన్​ హై'(మోదీ ఉంటే అన్నీ సాధ్యమే) అంటూ ప్రజల ముందుకు వెళ్లనుంది భాజపా. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి  అరుణ్​ జైట్లీ ప్రకటించారు.

"మోదీ ఉంటే అన్నీ సాధ్యమే"

By

Published : Mar 15, 2019, 12:03 AM IST

లోక్​సభ సభ ఎన్నికల కోసం భాజపా కొత్త నినాదాన్ని ప్రకటించింది. 'మోదీ హైతో ముమ్కిన్​ హై'(మోదీ ఉంటే అన్నీ సాధ్యమే) నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ తన బ్లాగ్​లో వెల్లడించారు.

ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు అరుణ్​ జైట్లీ. మోదీ ఐదేళ్ల నుంచి 24గంటలూ తీరిక లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. ప్రధాని చురకైన వ్యక్తని, ఏ విషయాన్నైనా సులభంగా, త్వరగా నేర్చుకుంటారని తెలిపారు.

"మోదీ పనితీరును దేశమంతా గుర్తిస్తోంది. భారతదేశం​ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రపంచదేశాలు అభినందిస్తున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల కోసం 'మోదీ హైతో ముమ్కిన్​ హై' అనే నినాదాన్ని ఎంపిక చేశాం. ఈ నినాదం ఎంతో సరైనది."
-- అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి.

మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జైట్లీ కొనియాడారు. జీఎస్టీ, ఆయుష్మాన్​ భారత్​ విశిష్టమైనవన్నారు.

ABOUT THE AUTHOR

...view details