తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంటు ప్యానెళ్ల కీలక కమిటీల్లో మార్పులు - parliamentary panels

కాంగ్రెస్​ నేతలు శశిథరూర్, వీరప్ప మొయిలీ నేతృత్వం వహిస్తున్న రెండు కీలక పార్లమెంటు ప్యానెళ్లకు భాజపా ఎంపీలను సారథులుగా నియమించింది కేంద్రం. ఇక నుంచి ఆర్థిక, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు భాజపా ఎంపీలు జయంత్ సిన్హా, పీపీ చౌదరీలు నేతృత్వం వహిస్తారు.

పార్లమెంటరీ ప్యానెళ్లలో కాంగ్రెస్ నేతల స్థానంలో భాజపా ఎంపీలు

By

Published : Sep 14, 2019, 7:06 AM IST

Updated : Sep 30, 2019, 1:18 PM IST

కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల వివరాలను శుక్రవారం రాత్రి సవరించింది లోక్​సభ సచివాలయం. గత లోకసభలో ఆర్థిక, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ నేతలు శశిథరూర్​, వీరప్ప మొయిలీల స్థానంలో భాజపా ఎంపీలు జయంత్​ సిన్హా, పీపీ చౌదరీలను నియమించింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో మొయిలీ ఓడిపోయారు.

తిరువనంతపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్​... ఇప్పడు ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.

విదేశీ వ్యవహారాల స్టాండింగ్​ కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఇకనుంచి భద్రతా స్టాండింగ్​ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఈ పార్లమెంట్​ ప్యానెల్​కు భాజపా నేత జువల్ ఓరమ్ నేతృత్వం వహిస్తున్నారు.

ఈ మార్పులతో గతంలో రెండు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒకదానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు స్టాండింగ్ కమిటీలను లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఏర్పాటు చేస్తారు.

ఇదీ చూడండి: ఇక యూపీ మంత్రులూ ఆదాయ పన్ను కట్టాల్సిందే..!

Last Updated : Sep 30, 2019, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details