తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్​ నిందితుడికి భాజపా ఎమ్మెల్యే సానుభూతి - BJP MLA

ఉన్నావ్​ అత్యాచార నిందితుడు సెంగార్​కు ఉత్తరప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే ఆశిష్​ సింగ్​ సానుభూతి తెలిపారు. గడ్డు పరిస్థితుల నుంచి సెంగార్​ త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు. ఆశిష్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని భాజపా తెలిపింది.

ఉన్నావ్​ నిందితుడికి భాజపా ఎమ్మెల్యే సానుభూతి

By

Published : Aug 4, 2019, 5:51 AM IST

Updated : Aug 4, 2019, 7:37 AM IST

ఉన్నావ్​ బాధితురాలికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. బాధితురాలికి సత్వర న్యాయం జరగాలని రోజురోజుకుఅనేక మంది డిమాండ్​ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నావ్​ అత్యాచార నిందితుడు కుల్​దీప్​ సెంగార్​కు సానుభూతి ప్రకటించారు ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే ఆశిష్​ సింగ్ ఆశు​. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి సెంగార్​ తొందరగా బయటపడాలని ఆకాంక్షించారు.

"మన సోదరుడు కుల్​దీప్​ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు. గడ్డు పరిస్థితులపై పోరాటం చేసి తిరిగి బయటకు వస్తారని ఆశిస్తున్నాం. మేము ఎక్కుడున్నా... కుల్​దీప్​ కోసం ప్రార్థిస్తాం."
--- ఆశిష్​​ సింగ్​ ఆశు, భాజపా ఎమ్మెల్యే.

ఉన్నావ్​లో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆశిష్​. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

'భాజపాకు సంబంధం లేదు...'

ఆశిష్​ సింగ్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే​ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని భాజపా ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని, పార్టీతో ముడిపెట్టవద్దని భాజపా ప్రతినిధి రాకేష్​ త్రిపాఠి స్పష్టం చేశారు.

బాధితురాలి పరిస్థితి విషమం..

జులై 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. న్యుమోనియా వ్యాధి సోకడం వల్ల పరిస్థితి మరింత విషమించిందని వివరించారు.

న్యాయవాదికి వెంటిలేటర్​ సహాయం తొలగించారు డాక్టర్లు. అయినా న్యాయవాది ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే స్పష్టత ఇవ్వలేమని వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'ఉన్నావ్'​ కేసులో పోలీసులకు లంచాలు..!

Last Updated : Aug 4, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details