తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేజ్రీవాల్ ట్వీట్లపై ఈసీకి భాజపా మరో ఫిర్యాదు - విజేందర్​ గుప్తా

సామాజిక మాధ్యమం ట్విట్టర్​ను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ దుర్వినియోగం చేశారని భాజపా ఆరోపించింది. కేజ్రీ ట్వీట్లు​ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.

కేజ్రీవాల్​పై ఎన్నికల సంఘానికి భాజపా మరో ఫిర్యాదు

By

Published : Mar 24, 2019, 6:54 AM IST

Updated : Mar 24, 2019, 7:03 AM IST

కేజ్రీవాల్​పై ఎన్నికల సంఘానికి భాజపా మరో ఫిర్యాదు

సార్వత్రిక ఎన్నికల వేళ దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఆమ్​ ఆద్మీ పార్టీ నేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్​పై మరోసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది భాజపా. కేజ్రీవాల్ ట్విట్టర్​ను దుర్వినియోగం చేసి​ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ భాజపా ఆరోపించింది. విజేందర్​ గుప్తా నేతృత్వంలోని భాజపా ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి కేజ్రీవాల్​పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

''కేజ్రీవాల్ సామాజిక మాధ్యమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టి, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు.''
- ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదులో భాజపా

ఇదీ కారణం..

'స్వస్తిక్​' గుర్తును చీపురు వెంబడిస్తున్నట్లు కేజ్రీవాల్ ఓ​ ట్వీట్ చేశారు.​ దీనిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అనంతరం ఆప్​ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ట్వీట్​లో చూపినది స్వస్తిక్​ కాదని, అది నాజీల గుర్తు అని వివరణ ఇచ్చింది.

kejriwal twitted image

గురుగ్రామ్​లో హోలీ సందర్భంగా ఓ ముస్లిం కుటుంబంపై జరిగిన దాడిని కేజ్రీవాల్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. దీనిని భాజపా ఖండించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు మతం రంగు పులమాలని చూస్తున్నారని దుయ్యబట్టింది.

భాజపా ఫిర్యాదుపై స్పందించిన ఆప్​ నేత రాఘవ్​ చందా ఓ ట్వీట్​ షేర్​ చేశారు. ఓ ఇంటి ముందు ఆవు, దూడ నిలబడి భాజపాకు ప్రచారం చేస్తున్నట్లు వ్యంగ్య చిత్రం ఉంచారు.
ఇదీ చూడండి :భారత్​ భేరీ: దిల్లీలో దోస్తీ...బంగాల్​లో కుస్తీ!

Last Updated : Mar 24, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details