ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని ఆమె అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే యత్నాల్లో భాజపా: సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఈ అంశంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే యత్నాల్లో భాజపా: సోనియా
పార్లమెంట్ హౌస్‌లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్‌పైనా విమర్శలు గుప్పించారు. భగత్‌సింగ్ కోశ్యారీ.. ఎన్నడూ లేని విధంగా, ఖండించదగిన రీతిలో వ్యవహరించారని అరోపించారు.
ఇదీ చూడండి: ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా దిద్దుబాటు చర్యలు