తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడే భాజపా అభ్యర్థుల తొలి జాబితా - భాజపా

లోక్​సభకు పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనుంది భాజపా. మొదటి దశ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించనుంది.

అమిత్​ షా

By

Published : Mar 16, 2019, 5:00 AM IST

లోక్​సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ నేడు విడుదల చేయనుంది. ఏప్రిల్​11న పోలింగ్​ జరిగే 91 లోక్​సభ స్థానాలకుఈ జాబితాలోఅభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

జాబితా విడుదలకు ముందు... భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా పాల్గొంటారు.

మొదటి దశ రాష్ట్రాలివే

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, మహారాష్ట్ర, పశ్చిమ బంగ, ఒడిశా, అసోంలో ఏప్రిల్​ 11న లోక్​సభ మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.

సీనియర్​ నాయకులకు ఉద్వాసన

కొంతమంది సీనియర్​ నాయకులకు ఉద్వాసన తప్పకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొంతమంది సిట్టింగ్ ఎంపీలకూ సీట్లు దక్కకపోవచ్చనే అంచనాలున్నాయి. దీంతో ఎటువంటి వివాదాలు, విభేదాలు తల్లెతకుండా మోదీ- అమిత్​ షా ద్వయం చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయాలని ప్రధాని మోదీ ఎంపీలందరికీ సందేశం పంపినట్లు సమాచారం. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా అధినాయకత్వం పార్టీ శ్రేణులకు ఇదివరకే పిలుపునిచ్చింది. ఎంపీలపై ప్రజల అభిప్రాయాలనూ సేకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details