తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా ప్రభుత్వం వస్తే యడ్యూరప్పే సీఎం' - karnataka

కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉంటారని ఆ పార్టీ నేత సదానంద గౌడ స్పష్టం చేశారు. అధికార కూటమి ఎమ్మెల్యేల రాజీనామాలో భాజపా పాత్ర లేదని తెలిపారు. మరోవైపు... ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలను చింపేశారని రాష్ట్ర మంత్రి ​డీకే శివకుమార్​పై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటక

By

Published : Jul 6, 2019, 5:50 PM IST

కర్ణాటకలోని అధికార కూటమిలో నెలకొన్న సంక్షోభానికి, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు భాజపా నేత సదానంద గౌడ. గవర్నర్​ ఆహ్వానిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సదానంద గౌడ, భాజపా నేత

"ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు ఇదే మంచి సమయమని వారు భావించి ఉండవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉండి వారి నియోజకవర్గాలకు ఏమీ చేయలేమని భావించారు. అందుకే వాళ్లు రాజీనామా చేశారు. ఈ విషయంలో ఏ భాజపా నేత, ఎమ్మెల్యే పాత్ర లేదు. ఎలాంటి స్థితిలోనూ పార్టీ ఇందులో జోక్యం చేసుకోలేదు. ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్​దే అంతిమ అధికారం. ఆయన చట్ట ప్రకారం ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మేం సిద్ధం. 105 ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్నాం. యడ్యూరప్పనే మా సీఎం అభ్యర్థిగా ప్రకటించాం. మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆయనే ముఖ్యమంత్రి."

-సదానంద గౌడ, కర్ణాటక భాజపా నేత

మంత్రిపై యడ్యూరప్ప ఆగ్రహం

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్​పై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో శివకుమార్​ అధికార బలంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు.

"శివకుమార్​ ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారు. స్పీకర్​ కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలను చింపేశారు. ఇది ఖండించాల్సిన విషయం."

-బీఎస్​ యడ్యూరప్ప, భాజపా నేత

ఇదీ చూడండి: ఏ క్షణమైనా కుమారస్వామి సర్కార్​ పతనం!

ABOUT THE AUTHOR

...view details