సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో సత్తా చూటుతోంది. బంగాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్కు దీటైన పోటీనిస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రం తమిళనాడు మినహా అన్ని చోట్ల చతికిలపడింది. ఆ రాష్ట్రంలో డీఎంకే పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బిహార్లోనూ కాంగ్రెస్ కూటమి రాజకీయాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు.
ఫలించిన వ్యూహాలు
ప్రస్తుతం ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే ఐదేళ్లలో పెరిగిన మోదీ ప్రాబవం ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. భాజపా.. దేశ భద్రత, జాతీయవాదం నినాదాలు, మోదీ ప్రచారం ఫలించినట్టే కనిపిస్తున్నాయి.