2019 సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో కమలం సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో విజయ బావుటా ఎగురువేసింది కాంగ్రెస్. అయితే ఏడాదికే అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ మూడు చోట్ల అధికార కాంగ్రెస్‌ను కాదని ప్రజలు కమలానికి జై కొట్టారు.
దిల్లీలో కాషాయం...
దిల్లీలో ఆమ్ఆద్మీని భాజపా దీటుగా ఎదుర్కొంది. దేశ రాజధానిలో పాగా వేయాలన్న కమలం కల నెరవేరింది. దిల్లీలో కాషాయ పార్టీ దూసుకుపోతోంది.
బంగాల్లో అడుగు...
ఎన్నో ఏళ్లుగా బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ హవా నడుస్తోంది. అక్కడ దీదీని ఎదుర్కొని అడుగుపెట్టాలని భాజపా ఎప్పటినుంచో విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బంగాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక్కడ కాలు మోపాలన్న భాజపా ఆశలు నెరవేరాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌కు ఇక్కడ గండి పడింది.