తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రథయాత్ర'పై భాజపా దుష్ప్రచారం: టీఎంసీ - టీఎంసీ భాజపా

'రథయాత్ర'కు బంగాల్​ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదంటూ.. భాజపా తమపై దుష్ప్రచారం చేస్తోందని తృణమూల్​ కాంగ్రెస్​ మండిపడింది. ఇలాంటి చర్యలతో ప్రజల నుంచి సానుభూతి పొందాలని చూస్తోందని విమర్శించింది. భాజపా యాత్రకు తమ ప్రభుత్వం అనుమతులు నిరాకరించలేదని స్పష్టం చేసింది.

rath yatra clearance in Bengal
'రథయాత్ర'తో భాజపా దుష్ప్రచారం చేస్తోంది: టీఎంసీ

By

Published : Feb 5, 2021, 3:56 PM IST

'రథయాత్ర'కు అనుమతులు మంజూరు చేయలేదని తమ ప్రభుత్వంపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) ధ్వజమెత్తింది. ఇలాంటి చర్యలతో భాజపా సానుభూతి పొందాలని యత్నిస్తోందని విమర్శించింది. భాజపా చేపట్టిన ఈ కార్యక్రమానికి బంగాల్​ ప్రభుత్వం అనుమతులు నిరాకరించలేదని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేసింది. దానివల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం కలగబోదని పేర్కొంది.

"భాజపా చెబుతున్నట్లుగా... ఏ యాత్రకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించలేదు. దురుద్దేశంతో వాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించిందన్న విషయం నిజమే అయితే.. అందుకు తగిన ఆధారాలు భాజపా సమర్పించాలి. ఇలాంటి చర్యలతో సానుభూతి పొందాలని ఆ పార్టీ యత్నిస్తోంది. రథయాత్రకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి భాజపా అనుమతులు తీసుకుంది. దీనికి సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ప్రస్తుతం ఆ అంశం సబ్​ జుడీస్​ పరిధిలో ఉంది. దీనిపై తీర్పు వచ్చిన తర్వాత మా పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని అందరికీ స్పష్టమవుతుంది.

-తృణమూల్​ కాంగ్రెస్​

రథయాత్ర విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ.. బుధవారం కోల్క​తా హైకోర్టులో ఓ పిల్​ దాఖలైంది. కొవిడ్​ పరిస్థితులు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని ఆ వ్యాజ్యంలో పిటిషనర్​ పేర్కొన్నారు.

విజయవంతంగా జరుపుతాం...

ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యేందుకు చేపట్టిన ఈ రథయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీఎంసీ యత్నిస్తోందని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ ఆరోపించారు. ఎన్ని రకాలుగా యత్నించినా తాము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:బంగాల్​ దంగల్: ఓవైసీ ఎంట్రీతో దీదీకి పరేషాను?

ABOUT THE AUTHOR

...view details