తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రమంత్రి ముందే కార్యకర్తల 'పాదరక్షల ఫైట్'! - ravi shankar prasad

పట్నాలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్​ పర్యటన సందర్భంగా భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రవిశంకర్​ ప్రసాద్​ పర్యటనకు నిరసనగా నల్లజెండాలు ప్రదర్శించారు ఆర్కే సిన్హా మద్దతుదారులు. ఫలితంగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. 'పాదరక్షల ఫైట్' చేసుకున్నారు కార్యకర్తలు.

కేంద్రమంత్రి ముందే నేతల 'పాదరక్షల ఫైట్'

By

Published : Mar 26, 2019, 7:14 PM IST

కేంద్రమంత్రి ముందే నేతల 'పాదరక్షల ఫైట్'
బిహార్​లోని ప ట్నాలో కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు ఊహించని అనుభవం ఎదురైంది. రాజ్యసభ ఎంపీ, భాజపా నేత ఆర్​.కె.సిన్హాను కాదని రవిశంకర్​కు లోక్​సభ టికెట్​ ఇవ్వటంపై సిన్హా మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. రవిశంకర్​ ప్రసాద్​ విమానాశ్రయానికి చేరుకోగానే నల్లజెండాలతో ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.

పట్నా లోక్​సభ స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు రవిశంకర్​ ప్రసాద్​. ఏప్రిల్​ 11న జరగనున్న మొదటిదశ ఎన్నికలకు నామినేషన్​ వేసిన తర్వాత మొదటిసారి పట్నా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. భాజపామరో నేత ఆర్కే సిన్హా మద్దతుదారులు కూడా విమానాశ్రయానికి చేరుకొని.. రవిశంకర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పాదరక్షలతో ఫైట్ చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details