జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు ఈ అంశంలో ఒకరినొకరు విభేదిస్తూ.. దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించింది.
ఎన్ఆర్సీకి, ఎన్పీఆర్కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్పీఆర్ సమాచారాన్ని ఎన్ఆర్సీకి వినియోగిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొనటంపై ఈ మేరకు స్పందించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. ఓ వార్తా పత్రికలో వచ్చిన ప్రతిని జోడిస్తూ ట్వీట్ చేశారు.
రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి.
" భారతదేశ ప్రజలను మోసం చేసే క్రమం ఇది.. 1. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై హోంమంత్రి ప్రకటన. 2. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై భాజపా ప్రభుత్వం తొమ్మిది కార్యక్రమాల్లో వెల్లడి. 3. హోంమంత్రి ప్రకటనను విభేదిస్తూ.. ఎన్ఆర్సీ లేదన్న ప్రధాని. 4. ఎన్పీఆర్కు, ఎన్ఆర్సీకి ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి వివరణ. 5. ప్రధాని, హోంమంత్రి వ్యాఖ్యలతో విభేదిస్తూ.. ఎన్పీఆర్ సమాచారాన్ని ఎన్ఆర్సీకి వినియోగిస్తామని న్యాయశాఖ మంత్రి వెల్లడి. "
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి.
ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రాజౌరి జిల్లాలో ఐఈడీ గుర్తింపు