తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ 'న్యాయ్​'ను ఎదుర్కొనేదెలా?' - భాజపా

కనీస ఆదాయ పథకం, ప్రియాంక గాంధీ... ఎన్నికల వేళ కాంగ్రెస్​ ప్రయోగించిన కీలక అస్త్రాలు. ఇప్పుడు ఈ రెండింటినీ ఎదుర్కోవడంపై భాజపా దృష్టిసారించింది. ప్రతి వ్యూహాలు రచించడంలో నిమగ్నమైంది.

భాజపాలో న్యాయ్​పై అనుమానాలు

By

Published : Mar 30, 2019, 7:54 PM IST

భాజపాలో న్యాయ్​పై అనుమానాలు
'గరీభీ హఠావో' నినాదంతో పేదలకు కనీస ఆదాయ పథకం 'న్యాయ్​'ను ప్రకటించింది కాంగ్రెస్. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి నెలకు 6 వేలు అందిస్తామని సంచలన హామీ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ పథకంపై భాజపా విమర్శలు చేస్తున్నప్పటికీ లోలోపల మథన పడుతోంది.

రాష్ట్రాల వారీగా వ్యూహాలు అమలు చేస్తోన్న భాజపా.. 'న్యాయ్​'పై అనుమానాలు లేవనెత్తుతోంది. పథకంతో పార్టీకి జరిగే నష్టంపైనా దృష్టి సారించింది. ప్రజల్లో వస్తోన్న స్పందనపై ఎప్పటికప్పుడు సర్వే, నిఘా సంస్థలతో నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ పథకం ప్రజల్లోకి చేరి, వారు ఆకర్షితులైతే నష్టం తప్పదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రియాంక అరంగేట్రం.. మరో సమస్య

ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని తాజాగా ప్రకటించారు. ఆమె ప్రకటన కార్యకర్తల్లోనూ నూతనోత్సాహం తెచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె పోటీ చేస్తే భాజపా, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో కమల దళం అంచనా వేసే పనిలో ఉంది.

ఇదీ చూడండి:భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...!

ABOUT THE AUTHOR

...view details