రెండు నెలల పాటు హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని సర్వేలూ 'వచ్చేది మోదీ పాలనే!' అని అంచనాలు వెల్లడించాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న ప్రజాదరణకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని కాషాయ దళం స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు భాజపా ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు. ప్రధాని పాలనకు ప్రజలిచ్చిన బహుమతి భాజపా విజయమని వెల్లడించారు. సర్వేలు చెప్పినవాటి కన్నా మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
" 'వచ్చేది మోదీ పాలనే...!' ఇదే నినాదం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, 23న ఎగ్జిట్ పోల్స్ అంచనాలనూ అధిగమించి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం. ఇది మోదీ వల్లే సాధ్యమైంది. దేశాన్ని అభివృద్ధి చేసి.. ప్రధాని ప్రజల ఆశీర్వాదం పొందారు. ఇదే గుజరాత్‌లోనూ జరిగింది. మోదీ పాలన, క్రమశిక్షణ, నిజాయితీ ఈ ఫలితాలకు కారణం."
--- జీవీఎల్ నరసింహ రావు, భాజపా ప్రతినిధి.
'ఎగ్జిట్ పోల్స్ లెక్కలన్నీ తప్పులే...'