డిసెంబర్‌లో భాజపా జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు భాజపా జాతీయ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ఆ పార్టీ ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. అక్టోబర్ 10 నుంచి 30వ తేదీ వరకు బూత్‌స్థాయి, నవంబర్‌లో జిల్లాస్థాయి విభాగాలకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు నడ్డా. ఆ తర్వాత రాష్ట్రస్థాయి విభాగాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
18 కోట్లకు సభ్యత్వ నమోదు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు జేపీ నడ్డా. 7 కోట్ల మందికి కొత్తగా సభ్యత్వం కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారి సంఖ్య 18 కోట్లకు చేరుతుందని తెలిపారు.
"ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిగిన సభ్యత్వాలు 5.81కోట్లు. ఇది మా లక్ష్యంలో 50 శాతానికిపైగా ఉంది. 65 లక్షల మంది ఆఫ్‌లైన్ ద్వారా సభ్యత్వం తీసుకున్నారు. మిస్డ్ కాల్ సర్వర్ సరిగా పనిచేయకపోవటం వల్ల డిజిటల్‌గా నమోదు చేయలేకపోతున్నాం. ఫారాల ద్వారా కేంద్ర సర్వర్‌కు అనుసంధానిస్తున్నాం. ఈ మొత్తం సభ్యత్వాలు 7 కోట్లకు చేరుకోనున్నాయి."
- జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షులు.
ఇదీ చూడండి: 'ఆరోగ్యకర జీవితానికి ఫిట్నెస్ తప్పనిసరి షరతు'