తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ​లో రాహుల్​పై పోటీకి ఎన్డీఏ అభ్యర్థి ఖరారు

కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై పోటీకి ఎన్డీఏ అభ్యర్థి ఖరారయ్యారు. వయనాడ్​లో ఎన్డీఏ తరఫున భారత ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లిని బరిలోకి దింపుతున్నట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు అమిత్​షా.

By

Published : Apr 1, 2019, 7:04 PM IST

Updated : Apr 1, 2019, 7:09 PM IST

కేరళలో రాహుల్​పై పోటీగా తుషార్​

కేరళ వయనాడ్​లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై పోటీకి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తుషార్ వెల్లప్పల్లిని బరిలోకి దింపింది భాజపా. తుషార్ కేరళలో ఎన్డీఏ కూటమి భాగస్వామి 'భారత్​ ధర్మ జన సేన పార్టీ (బీడీజేఎస్​)' అధ్యక్షుడు​.

"వయనాడ్​ ఎన్డీఏ అభ్యర్థిగా భారత్​ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లిని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నా. సామాజిక న్యాయం, అభివృద్ధే లక్ష్యంగా మాతో ముందుకు సాగుతారు. కేరళ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్డీఏ అవతరిస్తుంది."
-ట్విటర్​లో అమిత్ షా

శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం(ఎస్​ఎన్​డీపీ) ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ వారసుడు తుశార్​ వెల్లప్పల్లి. కేరళలో ఈళవా సామాజిక వర్గ సంక్షేమానికి ఎస్​ఎన్​డీపీ కృషి చేస్తోంది. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయగలరనే అంచనాతోనే తుషార్​ను రాహుల్​పై బరిలో దింపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమేఠీలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్​ గాంధీ కేరళలో వయనాడ్​ను రెండో స్థానంగా ఎంచుకున్నారని అమిత్​ షా ఇదివరకే విమర్శించారు.

ఇదీ చూడండి:భారత్​ భేరి: 'రంగీలా' రాజకీయం ఫలించేనా?

Last Updated : Apr 1, 2019, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details