తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగులకు టీకా ఇచ్చే యోచనలో స్టీల్​ సంస్థలు - steel makers decides for big vaccination

ప్రముఖ స్టీల్​ తయారీ సంస్థలు తమ ఉద్యోగులకు కొవిడ్ టీకా ఇవ్వడానికి నిర్ణయించాయి. కార్పొరేట్​ వ్యవస్థలకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

BIZ-VACCINE-STEEL MAKERS
ఉద్యోగులకు టీకా ఇచ్చే యోచనలో స్టీల్​ సంస్థలు

By

Published : Jan 18, 2021, 3:07 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ ప్రారంభమైన నేపథ్యంలో.. పేరుగాంచిన పలు స్టీల్​ ఉత్పత్తి సంస్థలు తమ ఉద్యోగులకు కొవిడ్​ టీకా​ ఇవ్వాలనే యోచనలో ఉన్నాయి. దీని ద్వారా కేంద్రం చేపట్టిన టీకా డ్రైవ్​ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నాయి.

దేశీయ స్టీల్​ సంస్థలైన టాటా స్టీల్​, అర్సిలర్​ మిట్టల్​ నిప్పన్​ స్టీల్​ ఇండియా(ఏఎమ్​ఎన్​ఎస్​ ఇండియా), రాష్ట్రీయ ఇస్పత్​ నిగమ్​ లిమిటెడ్(ఆర్​ఐఎన్​ఎల్​)​లు.. ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాయి. ఇప్పటికే జేఎస్​డబ్ల్యూ స్టీల్​, జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్​ లిమిటెడ్​(జేఎస్​పీఎల్​) తమ అవసరాలకు సరిపడా టీకాలను అందించాల్సిందిగా వ్యాక్సిన్​ తయారీ సంస్థలను సంప్రదించాయి.

అత్యధిక మోతాదులో టీకా డోసుల కోసం వ్యాక్సిన్​ తయారీదారులను సంప్రదించాం. కరోనా యోధులకు వ్యాక్సినేషన్​ పూర్తయిన తర్వాత మాకు అందుతాయి. టీకా ఇచ్చే ప్రాధాన్య క్రమాన్ని కంపెనీ ఇప్పటికే నిర్ణయించింది. మొదట 50ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఇవ్వాలనుకున్నాం. కొవిడ్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు మా కంపెనీ 2020 సెప్టెంబర్​ నుంచి ప్రతి ఉద్యోగికి నెలకు రెండు సార్లు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నాం.

-పంకజ్​ లోచన్​, జేఎస్​పీఎల్ హ్యుమన్​ రిసోర్స్​ ముఖ్య అధికారి​.

మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ 55వేల ఉద్యోగులకు టీకా ఇవ్వడానికి జేఎస్​డబ్ల్యూ గ్రూప్​ సన్నాహాలు చేస్తోంది. 2 లక్షల కొవిడ్​ డోసుల కోసం తయారీ సంస్థలతో చర్చలు జరిపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ రెండు డోసులను ఇవ్వనుంది.

ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఆర్​ఐఎన్​ఎల్, ఎస్​ఏఐఎల్​లు తమ ఉద్యోగుల వివరాలను కేంద్రానికి పంపించాయి. ఈ రెండు సంస్థలూ తమ సైట్లలో ఆసుపత్రులను నడుపుతున్నాయి.

మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేంద్రం, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలతో మా సంస్థ కలిసి పనిచేస్తోంది. ఝార్ఖండ్‌ జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్​ హాస్పిటల్​ (టీఎమ్​హెచ్) రాష్ట్రంలోనే అతిపెద్ద కొవిడ్ కేర్ సెంటర్​గా ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జనవరి 16 నుంచి టీఎమ్​హెచ్​లో టీకా పంపిణీ జరుగుతోంది.

-టాటా స్టీల్​ ప్రతినిధి.

"మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఎక్కువ టీకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు.. మా ఉద్యోగులకు కూడా టీకాలు ఇస్తాం. టాటా స్టీల్​ ఎల్లప్పుడూ తన ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉంది" అని ప్రతినిధి చెప్పారు.

ఇదీ చదవండి:శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details