తెలంగాణ

telangana

By

Published : Jun 24, 2019, 3:17 PM IST

ETV Bharat / bharat

లోక్​సభ ముందుకు పలు కీలక బిల్లులు

ఆధార్​, జమ్మకశ్మీర్​ రిజర్వేషన్ బిల్లు​ సహా మరిన్ని చట్ట సవరణ బిల్లులు నేడు లోక్​సభ ముందుకు వచ్చాయి. సవరణలపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు.

లోక్​సభలో కీలక బిల్లులు

జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్​, ఆధార్​ చట్ట సవరణ బిల్లులు నేడు లోక్​సభ ముందుకు వచ్చాయి. ఆధార్​తో పాటు భారతీయ టెలిగ్రాఫ్​, మనీలాండరింగ్​ నిరోధక చట్ట సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్​ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తరఫున ఆ శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ప్రవేశపెట్టారు.

ఆధార్-2016 చట్ట సవరణ ఆమోద ప్రక్రియ పూర్తయితే బ్యాంకు ఖాతా తెరిచేందుకు, కొత్త ఫోన్​ కనెక్షన్(సిమ్​కార్డు) కోసం ఆధార్​ తప్పనిసరి కాదు. వినియోగదారుడు ఇష్టముంటే స్వచ్ఛందంగా గుర్తింపులా వాడుకోవచ్చు.

సవరణల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానమిచ్చారు కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్. ఆధార్​ కార్డు ఎవరి గోప్యతకు భంగం కలిగించదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను ఆధార్​ సంరక్షిస్తోందని చెప్పారు.

జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సవరణ ప్రకారం జమ్ముకశ్మీర్​లో వాస్తవాధీన రేఖ వెంబడి 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న వారు నేరుగా ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, ప్రొఫెషనల్​ కోర్సుల్లో ప్రవేశాల్లో రిజర్వేషన్లు పొందొచ్చు.

కొందరు విపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించగా, వారి డిమాండ్లను స్పీకర్​ ఓం బిర్లా తోసిపుచ్చారు.

ఇదీ చూడండి : రూ. 7లక్షల నీటి బిల్లు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి!

ABOUT THE AUTHOR

...view details