తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2020, 5:39 AM IST

Updated : Feb 18, 2020, 7:59 AM IST

ETV Bharat / bharat

అసెంబ్లీలో మిడతల బుట్టతో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే

రాజస్థాన్​ బికనీర్ నియోజకవర్గం ఎమ్మెల్యే.. అసెంబ్లీకి మిడతల బుట్టతో వచ్చారు. మిడతల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నిరసన తెలిపేందుకు ఇలా చేశారు.

Bikaner MLA comes with Locusts in Rajasthan
అసెంబ్లీలో మిడతల బుట్టతో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే

అసెంబ్లీలో మిడతల బుట్టతో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే

చట్టసభల్లో అధికార విపక్షపార్టీ సభ్యుల వాదోపవాదనలు సహజమే. ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోని లోటుపాట్లను ప్రతిపక్ష సభ్యులు ఎండగడుతుంటారు. అయితే రాజస్థాన్‌ విధానసభలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేంటంటే.. బికనీర్‌ భాజపా ఎమ్మెల్యే బిహారీలాల్‌ ఓ బుట్ట నిండా మిడతలు తీసుకొని సభకు వచ్చారు. ఫలితంగా సభ మొత్తం ఒక్కసారిగా అతనివైపే తిరిగి చూసింది. మిడతల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని బిహారీలాల్ డిమాండ్ చేశారు.

" రాష్ట్రంలో మిడతల బెడద ఎక్కువగా ఉంది. వీటివల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఫలితం లేదు. అందుకే చేసేందుకే ఇలా చేశాను. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 జిల్లాల్లో రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తీవ్రమైన సమస్యపై దృష్టి సారించకుండా సీఏఏ చట్టం వ్యతిరేకించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది."
- బిహారీలాల్​, బికనీర్​ ఎమ్మెల్యే

ప్రస్తుత్తం రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏని వ్యతిరేకిస్తూ.. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. బిహారీలాల్‌ లేవనెత్తిన సమస్యపై ఆ రాష్ట్ర అధికారులు స్పందించారు. ఇప్పటికే ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, దాదాపు 3.70 లక్షల హెక్టార్ల పరిధిలో నివారణ చర్యలు కొనసాగుతున్నాయని వివరణ ఇచ్చారు.

ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: వైద్యుల పరిశీలనలో చైనా యాత్రికులు

Last Updated : Feb 18, 2020, 7:59 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details