అసెంబ్లీ ఎన్నికల వేళ.. కరోనా మహమ్మారి బిహార్ రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. జేడీయూ సీనియర్ నేత, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ దేవ్ కామత్ కరోనాతో శుక్రవారం కన్నుమూశారు.
కొవిడ్ సోకగా.. కొన్నిరోజుల నుంచి పట్నాలోని ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. కపిల్ మృతి పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కపిల్‌ను 'నిరాడంబరమైన నేత'గా కొనియాడారు.
" కపిల్ పాలనాదక్షుడు, ప్రసిద్ధ నేత. ఆయన మృతి నన్ను తీవ్ర విచారానికి గురి చేసింది. రాజకీయాల్లో, సామాజికంగానూ ఆయన లోటు తీరనిది"