దున్నపోతుపై వెళ్లి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020.
బిహార్‌లో వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. దున్నపోతుపై వెళ్లి నామపత్రాలు సమర్పించారు. ఈ నెల 28న ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికల కోసం రకరకాల విన్యాసాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు.
దున్నపోతుపై వెళ్లి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి
బిహార్‌లో ఎన్నికల వేడి రాజుకునేకొద్దీ ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటీలో నిలిచిన అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. దర్భాంగ జిల్లాలోని బహదూర్‌పుర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాచారి మండల్ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు.