తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బిహార్​ ఎన్నికల ప్రచారానికి 47 మైదానాలు, 19 హాళ్లు'

త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్నాలో 47 మైదానాలు, 19 హాళ్లలో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రకటించింది.

elections
బిహార్​ ఎన్నికలు

By

Published : Oct 4, 2020, 11:45 AM IST

Updated : Oct 4, 2020, 11:56 AM IST

బిహార్​లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాల కోసం 47 మైదానాలు, 19 హాళ్లు ఉపయోగించుకోవచ్చని బిహార్​ రాష్ట్ర ఉన్నతాధికారి ప్రకటించారు. ఈ స్థలాలను పట్నా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.

100 మంది మాత్రమే

అక్టోబర్​ 14 వరకు ప్రచారంలో పాల్గొనేవారి సంఖ్య 100కు మించకూడదని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.

" ఎన్నికల ర్యాలీలు, ప్రచారం కోసం జిల్లా అధికార యంత్రాంగం 47 మైదానాలు, 19 హాళ్లు గుర్తించింది. పలు పార్టీల సూచనల మేరకు మరిన్ని స్థలాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం ప్రకటించిన నూతన కొవిడ్ నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 తర్వాత నుంచి హాళ్లలో 200 మందికి అనుమతి ఉంటుంది. మైదానాల్లో ఎంత మంది అయినా హాజరుకావచ్చు".

-- కుమార్ రవి, పట్నా జిల్లా కలెక్టర్​

మూడు దశల్లో..

243 అసెంబ్లీ స్థానాలకుగానూ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

అక్టోబర్​ 28 (71 స్థానాలు)-మెుదటి దశ

నవంబర్ 3 (94 స్థానాలు)-రెండో దశ

నవంబర్ 7 (78 స్థానాలు)-మూడో దశ

నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మొదటి దశ నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 12న ముగుస్తుంది. తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది.

Last Updated : Oct 4, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details