బిహార్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల ధాటికి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 63.60 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. ఒక్కరోజులోనే 16 జిల్లాల్లో సుమారు 7 లక్షల మందిపై ప్రభావం చూపాయంటే.. ప్రవాహ ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వర్షాల కారణంగా ఎత్తయిన ప్రాంతాలు కూడా నీట మునిగాయి.