తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యా ప్రమాణాల్లో బిహార్​తో దిల్లీ పోటీ! - దిల్లీ

బిహార్​లో విద్యా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. విద్యార్థులు-ఉపాధ్యాయల నిష్పత్తిలో దేశంలోనే చివరి స్థానంలో ఉందని మానవ వనరులు అభివృద్ధి శాఖ వెల్లడించింది. ఇక్కడ 38 మంది విద్యార్థులకు గాను ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. బిహార్​ తర్వాత దేశ రాజధాని దిల్లీలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పీఆర్​టీలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

విద్యా ప్రమాణాల్లో బిహార్​తో దిల్లీ పోటీ!

By

Published : Aug 25, 2019, 5:27 PM IST

Updated : Sep 28, 2019, 5:37 AM IST


దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యా ప్రమాణాలు నానాటికీ క్షీణిస్తున్నాయి.

విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తిలో దేశంలోనే బిహార్​ చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 38 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. ఇక్కడా అదే పరిస్థితి. 35 మంది విద్యార్థులకు ఒక్కరే గురువు ఉన్నారు. ఉపాధ్యాయుల కొరతపై ఈమేరకు నివేదిక విడుదల చేసింది మానవ వనరుల అభివృద్ధి శాఖ.

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల్లో 30:1, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35:1 విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండాలి. కానీ బిహార్​లో ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఆర్​టీ నిష్పత్తి 39:1, దిల్లీలో 34:1గా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో బిహార్​లో 38:1, దిల్లీలో 35:1గా ఉంది.

సిక్కింలో చట్టానికి లోబడి పీఆర్​టీ నిష్పత్తి ఉంది.

పాఠశాలలపరంగా..

బిహార్​ లో 67.94శాతం ప్రాథమిక పాఠశాలలు, 77.86 శాతం మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి చాలా దారుణంగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఝార్ఖండ్​ ఉంది. ఇక్కడ 50శాతం ప్రాథమిక పాఠశాలలు, 64శాతం మాధ్యమిక పాఠశాలల్లో పీఆర్​టీ నిష్పత్తి ప్రతికూలంగా ఉంది.

దేశవ్యాప్తంగా 26శాతం ప్రాథమిక పాఠశాలలు, 31 శాతం మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది.

ఇదీ చూడండి : 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​ రహస్యం చెప్పేసిన మోదీ!

Last Updated : Sep 28, 2019, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details