కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో దళిత యువతి హత్యాచార ఘటనపై స్పందించిన ఆ పార్టీ నేతలు.. పంజాబ్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. హాథ్రస్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఏమైపోయారని నిలదీశారు.
" మన మనసుల్ని కలచివేసే విషయం గురించి మాట్లాడుతున్నా. పంజాబ్ హోషియార్‌పుర్‌లో బిహార్‌కు చెందిన వలస కార్మికుల కుమార్తె, ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగింది. శరీరం సగం కాలిపోయింది. ఈ విషయం తెలిశాక కూడా రాహుల్, ప్రియాంక మనస్సాక్షిలో చలనం రావడం లేదా? ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే వెెళ్లేవారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? "