తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమ్మ, నాన్నకు రోజూ గొడవే.. నేను చనిపోతా' - president

"అమ్మా, నాన్న గొడవపడుతున్నారు నేను చచ్చిపోతా.. అనుమంతిచండి" అంటూ బిహార్​లోని భాగల్​పుర్​కు చెందిన ఓ బాలుడు రాష్ట్రపతికి లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లేఖ ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని భాగల్​పుర్​ జిల్లా అధికారులను ఆదేశించింది ప్రధాని కార్యాలయం.

అమ్మా.. నాన్న గొడవపడుతున్నారు నేను చచ్చిపోతా

By

Published : Jul 18, 2019, 10:37 AM IST

కేన్సర్‌తో బాధపడుతున్న తండ్రి, ఆయనతో తరచూ గొడవపడే తల్లి.. వీరిద్దరి మధ్య తాను నలిగిపోతున్నానని ఆవేదన చెందాడు ఓ 15 ఏళ్ల బాలుడు. తనకు స్వచ్ఛందంగా మరణించడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరాడు.

ఈ లేఖను రాష్ట్రపతి కార్యాలయం ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కార్యాలయం బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లా అధికారులను ఆదేశించింది. బాలుడి తండ్రి ప్రభుత్వాధికారి. తల్లి పట్నాలో ఓ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆ బాలుడు రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశాడు. కేన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రిని అసాంఘిక శక్తులతో తన తల్లి బెదిరింపులకు గురిచేస్తోందని లేఖలో తెలిపాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: చిన్నారి బతకదన్నారు.. కానీ జయించింది!

ABOUT THE AUTHOR

...view details