బిహార్ ముజఫర్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్, స్కార్పియో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి - bihar road accident
08:30 March 07
కాంటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసండా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముజఫర్‌పుర్ జిల్లా హతోడి వాసులని గుర్తించారు పోలీసులు.
07:34 March 07
బిహార్ ముజఫర్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28వ నెంబర్ జాతీయ రహదారిపై కాంటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్, స్కార్పియో వాహనం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.