తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భోజ్​పురి నటి వేదన: 'మోదీ సాయం చేయకపోతే చచ్చిపోతా' - భోజ్​పురి నటి మోదీని అడిగిన సాయం

'మోదీ సహాయం చేయపోతే చనిపోవటం తప్ప నాకు వేరే మార్గం లేదు' అంటూ ఓ నటి ప్రధానిని వేడుకుంది. తన భర్త అమెరికా వెళ్లకుండా ఆపాలని.. తన నుంచి వేరు చేయొద్దని రోదించింది.

భోజ్​పురి నటి వేదన: 'మోదీ సాయం చేయకపోతే చచ్చిపోతా'

By

Published : Oct 13, 2019, 8:31 PM IST

Updated : Oct 13, 2019, 9:20 PM IST

భోజ్​పురి నటి వేదన: 'మోదీ సాయం చేయకపోతే చచ్చిపోతా'

బిహార్ పట్నాలో భోజ్​పురీ నటి నేహా.. వెక్కివెక్కి ఏడుస్తూ తన భర్తను అమెరికా వెళ్లకుండా ఆపాలని ప్రధాని మోదీని కోరింది. ఈ మేరకు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తూ.. మోదీ తనకు సాయం చేయాలని లేదంటే చావే శరణ్యమంటూ రోదించింది.

పెళ్లి అయిన ఆరు నెలలు బాగానే ఉందని, తరువాత ఆమె భర్త తనను వేధించడం ప్రారంభించాడని చెప్పుకొచ్చింది నేహా. ఇంట్లో ఖైదు చేసి హింసించాడని, అమెరికా పౌరసత్వం ఉన్నందున తనను వదిలి యూఎస్​కు బయలుదేరాడని వాపోయింది. తన భర్త అమెరికా వెళ్లిపోతే భారత ప్రభుత్వం ఏమి చేయలేదని అందుకే ముందే ఆపాలని కోరింది.

మూడు రోజులుగా నిద్రాహారాలు మానేసి పోలీస్​ స్టేషన్​ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు నేహా.

"నేను హిందూస్థాన్​లో పుట్టడమే నేరమా..? భారత స్త్రీని ఎవరైనా మోసం చేయవచ్చా? చట్టం నా కోసం ఏమి చేయలేదా? దయచేసి నాకు సాయం చేయండి. నా భర్తను అమెరికా వెళ్లకుండా ఆపండి. తను అక్కడికి వెళ్లిపోతే మళ్లీ ఎప్పటికీ తిరిగిరాడు. ఆయన సోదరి, అమ్మ, బావ నా నుంచి తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. "

-నేహా, భోజ్‌పురి నటి

హరియాణాకు చెందిన నేహా మోడలింగ్ పట్ల ఉన్న మక్కువతో కొన్నేళ్ల క్రితం 100 రూపాయలతో ఇంటి నుంచి పారిపోయి ముంబయి చేరారు. ఇప్పటివరకు ఐదు భోజ్​పురి చిత్రాల్లో నటించారు. అందులో చంద్రికా, అంబా అనే చిత్రాలు తనకు పేరు తెచ్చిపెట్టాయి. తరువాత, నేహా ఎన్​బీ ఎంటర్​టైన్​మెంట్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

ఇదీ చూడండి:ఆర్టికల్ 370పై విపక్షాలకు మోదీ సవాల్​

Last Updated : Oct 13, 2019, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details