తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భీమా కొరేగావ్ కేసులో నిందితుడి అరెస్టు

భీమా కొరేగావ్ అల్లర్ల కేసులో ప్రొఫెసర్ ఆనంద్ టెల్టుంబ్డేని పోలీసులు అరెస్టు చేశారు.

బీమా కోరేగావ్ కేసు

By

Published : Feb 2, 2019, 12:05 PM IST

గతేడాది జనవరిలో జరిగిన భీమా కోరేగావ్​ అల్లర్ల కేసులో నిందితుడు ప్రొఫెసర్ ఆనంద్ టెల్టుంబ్డేని అరెస్టు చేశారు పుణె పోలీసులు.

గోవా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్​లో ఫ్యాకల్టీగా ఆనంద్​ పని చేస్తున్నారు. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్గర్ పరిషత్ కార్యక్రమంలో హింసకు కారణమయ్యరన్న ఆరోపణలపై ఆయన అరెస్టు చేశారు. మావోయిస్టులతోనూ ఆనంద్​కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు.

బెయిల్​కు నిరాకరణ

ఆనంద్​కు ముందస్తు బెయిల్​ మంజూరుకు పుణెలోని ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఎల్గర్​ పరిషత్​ అల్లర్లలో జరిగిన హింసలో ఆనంద్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు అదనపు సెషన్స్​ కోర్టు జడ్జి కిషోర్ వందనే.

ABOUT THE AUTHOR

...view details