పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకూ ఈ నిరసన ప్రదర్శన నిర్వహించ తలపెట్టారు. జామా మసీదు వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
'పౌర' జ్వాల: జామా మసీదు ఎదుట భీమ్ ఆర్మీ ఆందోళనలు - దిల్లీలో పౌర నిరసనలు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జామా మసీదు వద్ద భీమ్ ఆర్మీ నిరసనలు చేపట్టింది. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మసీదు నుంచి జంతర్ మంతర్ వరకూ ర్యాలీ చేయాలని నిర్ణయించగా పోలీసులు అనుమతి నిరాకరించారు.
Bhim Army
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. భీమ్ ఆర్మీ తలపెట్టిన ఈ ర్యాలీకి భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వేలాది మంది ప్రజలు జామా మసీదు వద్దకు తరలివచ్చారు.
జామా మసీదు వద్ద పరిస్థితిని పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.