తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విహారి: ప్రకృతి ఒడిలో కాసేపు 'భద్ర'ముగా...

భద్ర అభయారణ్యంలో ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అక్కడ జీవవైవిధ్యాన్ని చూడటానికి పర్యటకులు బారులు తీరుతున్నారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ.. ఉరుకుల పరుగుల జీవితాల్లో కాస్త విశ్రాంతి, వినోదం నింపుతున్నారు.

అభయారణ్యంలో ప్రకృతి అందాలు అదుర్స్​!

By

Published : Aug 6, 2019, 2:47 PM IST

అభయారణ్యంలో ప్రకృతి అందాలు అదుర్స్​!
కర్ణాటకలోని చిక్​మగళూరు ఓ సుందరమైన పర్యటక ప్రదేశం. చుట్టూ కొండలు, నదులు, జలపాతాలు, గుళ్లు... ఇలా మనసుకు హాయినిచ్చే ప్రకృతి సౌందర్యమంతా ఒక్క చోటే కనిపిస్తుందక్కడ. వారాంతాల్లో పర్యటకులతో నిండి ఉంటుంది ఈ ప్రదేశం.

ప్రకృతి అందాలకు స'జీవ' సాక్ష్యాలు

చిక్​మగళూరులో భద్ర అభయారణ్యం ఎంతో ప్రత్యేకం. ప్రకృతి అందాలే కాదు.. అరుదైన జంతువులూ, పక్షులూ, రకరకాల చెట్లు విరివిగా ఉంటాయి ఇక్కడ. నీటి కోసం వచ్చే ఏనుగులు.. దాహం తీర్చుకుని జలకాలాడే దృశ్యాలు.. బయటికొచ్చి సేదదీరి మళ్లీ నీటిలోకి వెళ్లే భారీ మొసళ్లు .. ఎలుగు బంటి ఆటలు.. నిదానంగా జారుతూపోయే సర్పాలు.. పెద్ద పులుల దర్జా విహారం.. చిరుతల వేటాడే కళ్లు.. గుంపులుగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ చిన్న చప్పుడుకే ఉలిక్కిపడే జింకల అమాయకత్వం.. ఒక్కటేమిటి జంతు ప్రపంచమే కనిపిస్తుందిక్కడ.

ఇక్కడ 250కి పైగా పక్షులు సందడి చేస్తాయి. రకరకాల పక్షుల కిలకిలారావాలు సంగీత రాగాలు వినిపిస్తూంటాయి. చిలుకలు, నెమళ్లు, పావురాలు, బాతులు, కోయిల వంటి పక్షులన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి.

"భద్ర అభయారణ్యం 492 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాన్ని ఇప్పుడు 500చ.కి.మీ.లకు విస్తరించాం. ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుత పులులు, ఎలుగు బంట్లనూ చూడవచ్చు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు కూడా ఉంటాయి. ప్రఖ్యాత పక్షి ప్రేమికుడు సలీం అలీ కూడా వివిధ రకాల పక్షులు చూడాలంటే భద్ర అభయారణ్యానికి వెళ్లాలని చెప్పారు. ఇక్కడ సమ్మోహన నది ఉంటుంది. అందుకే ఇక్కడ నీటికి కొరత ఉండదు."
-గిరిజ శేఖర్​, పర్యావరణవేత్త

1951లో మైసూర్​ ప్రభుత్వ పాలనలో, ఈ ప్రదేశాన్ని జాగర వాలీ వైల్డ్​లైఫ్​ అభయారణ్యంగా ప్రకటించారు. 1998లో పులుల, చిరుత వంటి క్రూర మృగాలకు సంరక్షణకు ఇక్కడ ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details