భాజపా అధ్యక్షుడు నడ్డాకు కరోనా
నడ్డా
17:44 December 13
భాజపా అధ్యక్షుడు నడ్డాకు కరోనా
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించినందున.. పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యుల సలహా ప్రకారం హోం ఐసోలేషన్లో ఉండనున్నట్లు వెల్లడించారు నడ్డా. గత కొద్ది రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగినవారిని పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
Last Updated : Dec 13, 2020, 6:04 PM IST