బంగాల్లో ఉద్రిక్తతలకు దారితీసిన విగ్రహ ధ్వంసం కేసులో విచారణను వేగవంతం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కోల్కతాలో భాజపా సభ సందర్భంగా ఓ కళాశాలలోని ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమయింది. ఈ విషయంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
"ఎన్నికల వేళ విద్యాసాగర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. మేం ఓ కమిటీని నియమించాం. అప్పుడు జరిగిన సంఘటనలు, కారణాలపై కమిటీ విచారిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే 35 మందిని అదుపులోకి తీసుకున్నాం. రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి